![]() |
![]() |

టాలీవుడ్ 90 స్ లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ.. ఆమె గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఇంద్రజ 80 కి పైగా సినిమాల్లో నటించింది. ఇంద్రజ ఓ సింగర్ కూడా. ‘చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. వివాదాలు అంటని స్టార్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఇంద్రజ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ కి జడ్జ్ గా చేస్తోంది. అలాగే కొన్ని ఈవెంట్స్ లో కూడా అప్పుడప్పుడు జడ్జ్ గా కనిపిస్తోంది. ఇక ఇంద్రజ తన పేమెంట్స్ లో కొంత అమౌంట్ ని బుల్లితెర షోస్ లో ఉండే వాళ్ళ కోసమే ఎక్కువగా ఖర్చుపెడుతూ వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది అని చెప్తూ ఉంటారు.
ఇక ఈమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన భర్త, తన కూతురు కూడా కనిపించారు. సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు వీరు. హాలిడే మోడ్ ఆన్ అయ్యింది అంటూ తన వాయిస్ తో ఒక వీడియోని కూడా స్టేటస్ లో పోస్ట్ చేశారు. "అర్ధరాత్రి 12 గంటలు దాటేసింది. అసలు మా ఆయన ఇలా ఎప్పుడూ అలౌ చేయరు.. ఏమో మరి.. అలాంటి ఆయన ఈరోజు బయటకు తీసుకొచ్చారు. ఇంకా మేము బయటే ఉన్నాము. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ అని కొత్తగా స్టార్ట్ చేసారు. చెన్నైలోని కతిపర బ్రిడ్జి దగ్గర. సడెన్ సర్ప్రైజ్ గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక ఇక్కడ ఫుల్ ఫన్ అన్నమాట. మేం ముగ్గురం మంచి క్వాలిటీ టైంని ఎంజాయ్ చేసాం." అంటూ ఫుల్ జోష్ తో చెప్పారు ఇంద్రజ.

ఇంద్రజని జబర్దస్త్ కమెడియన్స్ అంతా కూడా ఆమె చాలా డౌన్ టు ఎర్త్ అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆమె వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి పెద్దలకు తనకు తోచిన సాయం చేస్తూ ఉంటుంది. అందుకే బుల్లితెర మీద ఇంద్రజాని అందరూ ముద్దుగా ఇంద్రజమ్మా అని పిలుచుకుంటారు.
![]() |
![]() |